ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు నేడు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖమ్మం వన్ ఇన్సూరెన్స్ సంస్థలో మంగళవారం ఉదయం 10 గంటలకు మోడల్ కెరీర్ సెంటర్ లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్‌మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
